Martial Arts Woman
Female Martial Arts: తక్కువ అంచనా వేసి దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తికి దేహ శుద్ధి చేసింది ఆ మహిళ. మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ అయిన మహిళ చితక్కొట్టి వదిలిపెట్టింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడనే అరుస్తూ.. బస్సులో నుంచి పారిపోనివ్వకుండా పట్టుకుని దుమ్ము దులిపి వదిలింది.
బ్రెజిల్ లోని బెలెమ్ అనే సిటీలో అక్టోబర్ 20న మహిళ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో బస్సులో ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసిన మరో మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఈ వీడియోలో మహిళ అతని గొంతు పట్టుకుని విడిపించుకోనివ్వకుండా లాక్ చేసింది. అతణ్ని పూర్తిగా కంట్రోల్ నుంచి తప్పిస్తూ.. బస్సులో కిందకు ఆనించేసింది.
…………………………………… : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్
పోలీసుల కథనం ప్రకారం.. బిజీగా ఉన్న బస్సులో మహిళకు అతని జననాంగాలు రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో ప్యాంట్ జిప్ తీసి ఉండటం మిగిలిన ప్రయాణికులు కూడా గమనించారట. నేలకు ఆనించే ముందు అతని ముక్కు మీద పంచ్ లు విసిరింది ఆ మహిళ. కదలకుండా పట్టుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో బస్సు ఆపాలని డ్రైవర్ ను అడిగింది.
విచారణ జరిపిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నేరం రుజువైతే కోర్టు తీర్పు ప్రకారం.. బ్రెజిలియన్ చట్ట ప్రకారం.. ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు.