Aryan Khan : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్

డ్రగ్స్‌ కేసులో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ కు ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారించిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Aryan Khan : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్

Aryan

Aryan Khan Bail : డ్రగ్స్‌ కేసులో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ కు ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారించిన బాంబే హైకోర్టు గురువారం (అక్టోబర్ 28)న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వులు అందగానే ఆర్యన్ ఖాన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.  ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన బాంబే హైకోర్టు.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ జరిపింది.

ఎన్‌సీబీ (NCB) వాదనలకు 45 నిమిషాలు సమయం ఇచ్చింది హైకోర్టు. మరోవైపు రేపు (శుక్రవారం) మాత్రమే బాంబే హైకోర్టు పనిచేయనుంది. ఆ తర్వాత నవంబరు 15 వరకు కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ సహా మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3న ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. 21 రోజులు ఆర్థర్ రోడ్ జైల్లో గడిపిన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రావడంతో షారుక్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నారు. బెయిల్ కు సంబంధించి ఆర్డర్ కాపీని బాంబే హైకోర్టు రేపు (శుక్రవారం) ఇవ్వనుంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచాలో జైలు నుంచి శుక్రవారం లేదా శనివారం (రేపు లేదా ఎల్లుండి) విడుదలయ్యే అవకాశం ఉందని ముకుల్ రోహత్గీ మీడియాకు వెల్లడించారు.

Read Also : ఆర్యన్ ఖాన్ కేసులో రోజుకో మలుపు

మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ…. ఆర్యన్ ఖాన్ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆర్యన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు ముకుల్. క్రూయిజ్ షిప్‌లో పార్టీకి ఆర్యన్ ఖాన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారన్నారు. ప్రతీక్ గాబా అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపుమేరకు ఆర్యన్ ఖాన్ అక్కడికి వెళ్లినట్టుగా చెప్పారు. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్‌ను కూడా ఆహ్వానించడంతో ఇద్దరు కలిసి వెళుతున్న క్రమంలో వారిని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారని ముకుల్ వాదించారు.

అర్బాజ్‌కు ఆర్యన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తనతోపాటు కలిసి వెళ్లిన ఓ వ్యక్తి దగ్గర డ్రగ్స్‌ పట్టుబడితే ఆర్యన్‌ను ఎన్సీబీ అధికారులు ఏ విధంగా అరెస్టు చేస్తారంటూ వాదనలు వినిపించారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై మూడు రోజుల నుంచి సుదీర్ఘ విచారణ కొనసాగింది. కుట్రపూరితంగానే ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారని రోహత్గీ కోర్టుకు తెలిపారు.

ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా వైద్యపరీక్షల్లో ఎలాంటి ఆధారాలేమి లేవని కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు ఆర్యన్ ఎలా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఎన్సీబీ తరపున ఏఎస్ జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్ సహా నిందితులుగా ఉన్న మరో ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేసింది.
Read Also : Mumbai Cruise Drug Case : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు రెండో రోజు విచారణ