Mumbai Cruise Drug Case : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు రెండో రోజు విచారణ

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్  నిందితుడిగా ఉన్న క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై రెండోరోజు విచారణ బాంబే హైకోర్టులో ఈరోజు జరగనుంది.

Mumbai Cruise Drug Case : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు రెండో రోజు విచారణ

Aryan Khan Bail Piteetiion

Mumbai Cruise Drug Case :  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్  నిందితుడిగా ఉన్న క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై రెండోరోజు విచారణ బాంబే హైకోర్టులో ఈరోజు జరగనుంది.

నిన్న జరిగిన వాదనల్లో ఆర్యన్‌ఖాన్‌కు  బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తన కుమారుడిని జైలు నుంచి ఎలాగైనా విడిపించి బయటకు తీసుకువచ్చే క్రమంలో షారుఖ్ ఖాన్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు.

Also Read : Covid 19 Vaccine : రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భేటి

నిన్న జరిగిన వాదనల్లో క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు అసలు  సంబంధం లేదనే కోణంలో రోహత్గీ  గట్టిగా తన వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహత్గీ.. భారత్‌ కు 14వ అటార్నీ జనరల్ గా 2014 నుంచి 2017 వరకు పని చేశారు. అంతకు ముందు ఆయన అదనపు సొలిసిటర్‌ జనరల్‌గానూ పని చేశారు.