ఏం పిల్లరా బాబూ : రెండేళ్లు ప్రేమించింది.. పెళ్లయిన 12గంటల్లో వదిలేసింది
ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని, దీంతో

ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని, దీంతో
ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని, దీంతో పెళ్లయ్యాక వారి సంసారం సజావుగా సాగుతుందని అంటారు. అందుకే.. కొందరు ప్రేమ పెళ్లిళ్లకే జైకొడతారు. కానీ.. ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కలిసుంటారనే గ్యారంటీ లేదు. ఏ నిమిషానికి ఏమైనా జరగొచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమిర్ పూర్ జిల్లా మౌదాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
ఆ అమ్మాయి చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. అమ్మాయి ప్రవర్తన అబ్బాయితో పాటు ఇరు కుటుంబాల వారికి, పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? అనే సందేహాలు కలిగాయి. రెండేళ్ల పాటు అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి అతడితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకున్న 12 గంటల్లోనే అబ్బాయిని వదిలేసింది. నాకీ పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చింది. దీంతో విస్తుపోవడం అందరి వంతైంది.
అబ్బాయి పేరు సందీప్. తన క్లాస్ మెట్ ను ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా సందీప్ ను లవ్ చేసింది. ఇద్దరూ రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వారి ప్రేమ అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెపై వారు ఒత్తిడి తెచ్చారో మరో కారణమో తెలీదు కానీ.. అమ్మాయి సడెన్ గా మారిపోయింది. సంచలన నిర్ణయం తీసుకుంది. తన లవర్ సందీప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సందీప్ తనను వెంటపడి వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ను విచారిస్తున్నారు. ఇంతలో అమ్మాయి మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు.. సందీప్ ను అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే అమ్మాయి తన ఫిర్యాదుని వెనక్కి తీసుకుంది. దీంతో సందీప్ తో పాటు పోలీసులూ షాక్ అయ్యారు. అమ్మాయి ప్రవర్తనతో ఇరు కుటుంబాల వాళ్లు ఇబ్బంది పడ్డారు. అమ్మాయిని తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు.
తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించి, నా మైండ్ సరిగా పని చెయ్యడం లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. దయచేసి నన్ను క్షమించు అంటూ సందీప్ కాళ్లపై పడింది అమ్మాయి. దీంతో సందీప్ మనసు కరిగిపోయింది. తన పేరెంట్స్ ను ఒప్పించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అంతా శుభమే అని అనుకుంటున్న సమయంలో సందీప్ కి దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చింది అమ్మాయి. పెళ్లయిన 12 గంటల్లోనే తీవ్ర నిర్ణయం తీసుకుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను వదిలేయ్ అని సందీప్ కి బ్రేకప్ చెప్పింది.
దీంతో మరోసారి సందీప్ కి దిమ్మతిరిగిపోయింది. అమ్మాయి ప్రవర్తనతో విసిగిపోయిన సందీప్.. నీకో దండం తల్లి అని వదిలించుకున్నాడు. నీ మైండ్ కి ఏదో అయ్యింది, క్షణక్షణానికి నిర్ణయం మారుస్తున్నావు, నీలాంటి నిలకడలేని వ్యక్తితో నేను సంసారం చెయ్యలేను అని తేల్చి చెప్పి ఆ అమ్మాయిని వదిలేశాడు. మళ్లీ రంగంలోకి దిగిన పోలీసులు కూడా అమ్మాయి తీరుపై మండిపడ్డారు. ఏంటమ్మా ఇది అని అసహనం వ్యక్తం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు.. వారిని ఒప్పించి.. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేలా చేశారు.
Read More>>చించావు పో : హీరోయిన్ రష్మికపై జగిత్యాల కలెక్టర్ వివాదాస్పద ట్వీట్