Nirmala Sitharaman: వారికి ఫోన్లు చేసి వేధించేవారు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ మండిపడ్డారు. ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో ..

Nirmala Sitharaman

Nirmala Sitharaman: ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ మండిపడ్డారు. ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారల కోసం ఏటీఎంలా వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు. తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంక్ సిబ్బందికి ఫోన్లు చేసి వేధించేవారని నిర్మలా సీతారమన్ ఆరోపించారు. కానీ, నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయని తెలిపారు.

Also Read: Elon Musk: ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ జోరు.. సంపదలో ప్రపంచ రికార్డు

బీజేపీ హయాంలోనే 54 కోట్ల జన్ ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్ -అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు. మోదీ హయాంలో ‘4Rs’ వ్యూహంతోపాటు.. పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని, రూ. 3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ తో ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేశామని కేంద్ర మంత్రి అన్నారు.

Also Read: Rajasthan: రాజస్థాన్‌లో విషాదం.. 57గంటలు శ్రమించినా దక్కని బాలుడి ప్రాణం..

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘ రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్ పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సిబ్బందికి ఫోన్లు చేసి వేధించారు. రుణాలు ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’’ అంటూ పేర్కొన్నారు.