Rajasthan: రాజస్థాన్‌లో విషాదం.. 57గంటలు శ్రమించినా దక్కని బాలుడి ప్రాణం..

సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కాలిఖడ్ గ్రామంలో బాలుడు బోరు బావిలో పడిపోయాడు. తన తల్లి దగ్గర ఆడుకుంటూ ..

Rajasthan: రాజస్థాన్‌లో విషాదం.. 57గంటలు శ్రమించినా దక్కని బాలుడి ప్రాణం..

Boy Fell into Borewell in Rajasthan

Updated On : December 12, 2024 / 7:47 AM IST

Boy Fell into Borewell in Rajasthan : రాజస్థాన్ రాష్ట్రం దౌసాలో బోరుబావిలో పడిన ఆర్యన్ అనే ఐదేళ్ల బాలుడిని సుమారు 57గంటల తరువాత రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఫైలింగ్ మిషన్ తో 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడ్ని హుటాహుటీని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలుడు ప్రాణాలను కాపాడేందుకు మూడు రోజుల పాటు రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Also Read: Divorce Party : భార్యకు వెరైటీగా విడాకులిచ్చిన యువకుడు.. మాజీ భార్య దిష్టిబొమ్మతో ఫొజులిస్తూ డివోర్స్ పార్టీ చేసుకున్నాడు..!

సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కాలిఖడ్ గ్రామంలో బాలుడు బోరు బావిలో పడిపోయాడు. తన తల్లి దగ్గర ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బాలుడు బోరుబావిలో పడిన విషయాన్ని గమనించి స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గంటలోనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బోరుబావిలో బాలుడు ఉన్న ప్రదేశాన్ని చేరుకోవటానికి డ్రిల్లింగ్ మిషన్లను ఉపయోగించి సమాంతరంగా గొవ్విని తొవ్వారు.

Also Read; PF Withdrawal ATM : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 2025 జనవరి నుంచి ఏటీఎం నుంచే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు..!

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ (SDRF) సిబ్బంది బాలుడిని సురక్షితంగా తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేసి.. బోర్‌వెల్‌లోకి అమర్చిన కెమెరా ద్వారా బాలుడి కదలికలను కూడా రెస్క్యూ టీం గమనించింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని అతి కష్టంమీద బయటకు తీసినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.