Divorce Party : భార్యకు వెరైటీగా విడాకులిచ్చిన యువకుడు.. మాజీ భార్య దిష్టిబొమ్మతో ఫొజులిస్తూ డివోర్స్ పార్టీ చేసుకున్నాడు..!

Divorce Party : హర్యానాకు చెందిన యువకుడు తన విడాకుల వేడుక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ విదేశాల్లో మాత్రమే కనిపించేది.

Divorce Party : భార్యకు వెరైటీగా విడాకులిచ్చిన యువకుడు.. మాజీ భార్య దిష్టిబొమ్మతో ఫొజులిస్తూ డివోర్స్ పార్టీ చేసుకున్నాడు..!

Haryana Man Throws Divorce Party

Updated On : December 11, 2024 / 10:15 PM IST

Divorce Party : ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎంత ఆడంబరంగానూ పెళ్లిళ్లు చేసుకున్నా జీవితాతం కలిసి ఉంటారనే గ్యారంటీ లేకుండా పోతోంది. చాలా వివాహాలు కొంతకాలం తర్వాత విచ్ఛిన్నమవుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల వివాహాలు ఎక్కువ కాలం నిలబడవు. అయితే, ఈ విడాకుల పర్వం అనేది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. జంటలు విడాకులు తీసుకున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

ఇప్పటివరకూ పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు గురించి విన్నాం.. ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు కూడా వెడ్డింగ్‌లలో కామన్. కానీ, డివోర్స్ పార్టీలు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం.. విదేశాలలో చాలా మంది విడాకుల వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. విడాకుల తర్వాత తమ మాజీ పార్టనర్ గురించి పార్టీలను నిర్వహిస్తారు. విదేశాల్లో ఇలాంటి ఉదంతాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు భారత్ కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి తన విడాకుల వేడుకను జరుపుకునేందుకు ఇలా పార్టీ చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. 2020లో మంజీత్ అనే వ్యక్తి కోమల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి వైవాహిక జీవితం బాగాలేదు. చివరికి వారిద్దరూ ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఆ వ్యక్తి ఆమెకు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్‌లో, తాను విడాకుల పార్టీపై తన వివాహ ఫొటోను ముద్రించాడు. వివాహం, విడాకుల తేదీలను కూడా రాశాడు. ఫొటో ముందు చాలా కేకులు కూడా కనిపించాయి. వాటిని కట్ చేస్తూ ఆ వ్యక్తి విడాకుల వేడుకలు చేసుకున్నాడు.

విడాకుల పార్టీలో ఒక వ్యక్తి తన భార్య దిష్టిబొమ్మతో కనిపించాడు. చూసేందుకు ఆ వ్యక్తి భార్య దిష్టిబొమ్మగా చెబుతున్నారు. అయితే, ఆ వ్యక్తి భార్య దిష్టిబొమ్మతో పోజులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వల్ల ఓ వ్యక్తి ఎంత నిరుత్సాహానికి గురవుతాడో చూస్తేనే అర్థమవుతోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని వివాహం చేసుకుంటే కలిగే పరిణామం అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041)

Read Also : PF Withdrawal ATM : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 2025 జనవరి నుంచి ఏటీఎం నుంచే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు..!