ఘజియాబాద్ మురికివాడలో భారీ అగ్రిప్రమాదం

Fire Breaks Out At Slums In Ghaziabad ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్‌లోని సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా కృష్ణ విహార్ మురికివాడలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భూపురా కృష్ణ విహార్ ఏరియాలోని 200 మురికివాడలు అగ్నికి ఆహుతయ్యాయి. మురికివాడలో అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.



30 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన వచ్చి మురికివాడల్లో రాజుకున్న మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదంతో 200 మురికివాడల్లోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భూపురా కృష్ణ విహార్ మురికివాడల్లో అగ్నిప్రమాదం జరిగిందని ఫోన్ రావడంతో తాము అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి పంపించామని యూపీ పోలీసులు చెప్పారు. తమ పోలీసులు కూడా రంగంలోకి దిగి మురికివాడలో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారని జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ చెప్పారు. .