ఈ రాత్రికి పూణే నుంచి విమానంలో ఢిల్లీకి కోవిడ్ వ్యాక్సిన్

First Shipment Of Covid Vaccine To Land At Delhi Airport From Pune Soon ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా డెవలప్ చేసి..సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ బ్యాచ్ డోసులు పూణే నుంచి గురువారం(జనవరి-7,2020)రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరనున్నాయి. ఎయిర్ ఇండియా AI850 విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరనున్నాయి. ఎయిర్ పోర్ట్ కి చేరిన వెంటనే వీటిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించనున్నారు.

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశరాజధానికి ప్రధాన స్టోరేజీ ఫెసిలిటీగా ఈ హాస్పిటల్ సేవలందిస్తోంది. ఇక్కడి నుంచి వ్యాక్సిన్ డోసులను సిటీలోని 600 కోల్డ్ చైన్ పాయింట్స్ కి తరలించనున్నారు.

అయితే,ఒకవేళ ఈ రాత్రికి వ్యాక్సిన్ డోసులను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించలేకపోతే…వాటిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నే ఉంచనున్నారు. ఎయిర్ పోర్ట్ లో కూడా కోల్డ్ స్టోరేజీ సౌకర్యం ఉంది. శుక్రవారం ఉదయం వాటిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఉన్న కోల్డ్ ఛాంబర్స్ లో దాదాపు 27లక్షల డోసులను లేదా వయల్స్ ని నిల్వ చేయవచ్చు. ఒక రోజుకి 80లక్షల వయల్స్ వరకు ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చని ఎయిర్ పోర్ట్స్ సీఈవో విదేహ్ కుమార్ జయపురియా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు