సరైన దిశలో తొలి అడుగు…ఆర్థిక ప్యాకేజీపై రాహుల్

సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల సహాయార్థం రూ.1,7లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థికమంత్రి ప్రకటించారు.

కేంద్రం ప్రకటించిన రూ 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో వేసిన తొలి అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో మన రైతన్నలు, దినసరి కార్మికులు, మహిళలు, వృద్ధులకు అండగా నిలవాల్సిన సమయం ఇదని, ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక​ ప్యాకేజ్‌ సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని రాహుల్‌  ట్వీట్‌ ద్వారా తెలిపారు.

Also Read |  వుహాన్‌లో తిరగబెడుతున్న కరోనా.. కోలుకున్నవారిలో మళ్లీ పాజిటీవ్.. ఇతరులకు సోకుతుందా?