×
Ad

విస్తారా విమానంలో శానిటరీ నాప్కిన్స్ ఫ్రీ

  • Publish Date - March 11, 2019 / 10:25 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు విస్తారా విమానయాన సంస్థ మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ను సరఫరా చేసింది. మహిళలు ఎవరికైనా శానిటరీ నాప్కిన్‌లు అవసరమైతే విమాన సిబ్బంది వద్ద తీసుకోవాలని, వీటిని మీరు ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది.
  
విస్తారా హెచ్ఆర్..కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపా చదా మాట్లాడుతూ..భారతదేశంలో విమానాల్లో సానిటరీ నాప్ కిన్స్ అందించే మొట్టమొదటి సంస్థ విస్తారా ఎయిర్ లెన్స్ అని తెలిపారు. మా  విస్తారా సంస్థ ద్వారా ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించినందుకు ఒక మహిళగా తనకు ఎంతో సంతోషంగా ఉందనీ..దీని వల్ల చాలామంది మహిళా ప్రయాణికులకు లబ్ది చేకూరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.  రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానంలోనే ఉచితంగా శానిటరీ నాప్కిన్‌లు పొందవచ్చు’’ అని తెలిపారు.