Lord Vishnu Statue In puducherry Sea
Lord Vishnu Statue In puducherry Sea : నడి సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు ‘నారాయణుడు’ దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో విష్ణుమూర్తి విగ్రహం లభ్యమైంది మత్స్యకారులకు. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు శంఖు, చక్రాలు ధరించిన ఆదినారాయణుడి ప్రతిభ లభ్యమైంది. ఆ విగ్రహాన్ని చూసి తన్మయత్వం చెందిన మత్స్యకారులు భక్తితో రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టుకున్నారు. నారాయణుడి విగ్రహం దొరకటం మా అదష్ణం అని మురిసిపోయారు. ఆ తరువాత పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సముద్ర తీరానికి చేరుకున్న అధికారులు వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం 8వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం లభిస్తుందని..ఆ విగ్రహం ఏ ప్రాంతానికి చెందినదో తెలుస్తుందని చెబుతున్నారు.
Naga Statues : కృష్ణానదిలో భారీ సంఖ్యలో నాగదేవత విగ్రహాల మిస్టరీ
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం, వారి వలలకు చేపలు చిక్కడం సహజం. కొన్ని సందర్భాల్లో అరుదైన చేపలు చిక్కితే వారి పంట పడుతుంది. ఈ రోజు గంగమ్మ కరుణించిందని మురిసిపోతారు. కానీ చేపలు పట్టటానికి వెళ్లినవారికి సాక్షాత్తు నారాయణుడే విగ్రహంగా లభ్యమయ్యేసరికి వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. నడి సంద్రంలో నారాయణుడి విగ్రహం లభించటం మా అదృష్టమంటున్నారు.
తమిళనాడులోని చిన్నకాల్పట్టు గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు.. పుదుచ్చేరి నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లగా..చేపల కోసం వేసిన వలకు ఆదిదేవుని విగ్రహం చిక్కడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు క్యూ కట్టి వచ్చి చూసి తరిస్తున్నారు. సముద్రంలో స్వామి విగ్రహం దొరకడంతో ఆ విగ్రహం గురించి మరింత సమాచారం కోసం పురావస్తు అధికారులు పరిశీలిస్తున్నారు.