Road Accident: ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

గురుగ్రామ్‌ సమీపంలోని బినౌలా గ్రామం వద్ద నేషనల్ హైవేపై.. గుర్తు తెలియని ట్రక్..కారును ఢీకొన్న ఘటనలో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం కూడా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తుంది. గురువారం ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురుగ్రామ్‌ సమీపంలోని బినౌలా గ్రామం వద్ద నేషనల్ హైవేపై.. గుర్తు తెలియని ట్రక్..కారును ఢీకొన్న ఘటనలో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బిలాస్ పూర్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..మృతి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నారు.

Also read: Delhi Cops : తెలంగాణ పోలీసుల తీరుపై ఢిల్లీ పోలీసులు సీరియస్

సంస్థ పని నిమిత్తం వీరు గురువారం తెల్లవారుజామున కారులో గురుగ్రామ్‌ కు బయలుదేరారు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్ కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకరు సీనియర్ మేనేజర్ కాగా.. ఆయనకు రెండు నెలల వయసున్న పాప ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Also read: Kerala : నది దాటివెళ్లటానికి రైతు సూపర్ ఐడియా..ఇప్పుడు గ్రామస్తులందరికి ఇదే దారి

ట్రెండింగ్ వార్తలు