Kerala : నది దాటివెళ్లటానికి రైతు సూపర్ ఐడియా..ఇప్పుడు గ్రామస్తులందరికి ఇదే దారి

నది దాటివెళ్లటానికి రైతు సూపర్ ఐడియాతో ఇప్పుడు గ్రామస్తులందరికి ఇదే దారి అయ్యింది. చక్కగా గాల్లో కూర్చుని నదిని దాటేస్తున్నారు.

Kerala : నది దాటివెళ్లటానికి రైతు సూపర్ ఐడియా..ఇప్పుడు గ్రామస్తులందరికి ఇదే దారి

Kerala Farmer Finds Unique Solution To Cross River

Kerala Farmer Finds Unique Solution to Cross River : ఓ సమస్యలోంచి పుట్టిన వినూత్న ఆలోచన ఆ గ్రామ ప్రజలందరికి దారిగా మారింది. ఓ రైతుకు వచ్చిన ఐడియా నది దాటి వెళ్లే కష్టాన్ని దాటించింది. వంతెన వేసుకుంటే సమస్య తీరిపోతుందనుకుంటే వర్షాకాలం వర్షాలకు పెరిగిన నీటి వరద వంతెన సైతం మునిగిపోతున్న పరిస్థితి నుంచి ఓరైతు వేసిన ఐడియా ఆ గ్రామాస్తులకు నదిని దాటే కష్టాన్ని తప్పించింది. కేర‌ళ‌లోని మించినాక అనే ఓ చిన్న గ్రామంలో వ‌ర‌దా అనే న‌దిని దాటేందుకు ఓ రైతు చేసిన ఆలోచ‌న‌కు ఇప్పుడు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఆ రైతు పేరు కృష్ణ భ‌ట్. ఈయనకు మించినాక కాసర్ గోడ్ సరిహద్దులో వరద నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం వరదా నదికి అవ‌త‌లి వైపు.. ఇవ‌త‌లి వైపు మూడున్న‌ర ఎక‌రాల వ్య‌వ‌సాయ పొలం ఉంది. ఆ పొలంలో పంటలు పండించటం అంటే కృష్ణ భట్ కు భలే ఇష్టం.ఎంత వరద వచ్చినా పొలం వెళ్లి పని చేసుకోవటం అంటే భట్ కు భలే భలే ఇష్టం. ఆ ఇష్టం కాస్తా వర్షాకాలం వస్తే తీరని కష్టంగా మారిపోతోంది. నది దాటాలంటే కష్టమే. ప్రాణ సంకటమే. అందుకే కృష్ణ భట్ భలే ఆలోచన చేశాడు.

కృష్ణ భట్ వ్యవసాయ స్థ‌లంలో ప‌లుర‌కాల చెట్లు ఉన్నాయి. కొబ్బ‌రి చెట్ల‌తో పాటు పామాయిల్ చెట్లు కూడా ఉన్నాయి. అయితే… అటూ ఇటూ న‌దిని దాట‌డ‌మే కృష్ణ‌కు కష్టంగా మారిపోతోంది. నది దాటానికి సొంత ఖర్చులతో కృష్ణ భ‌ట్ ఒక చిన్న బ్రిడ్జిని నిర్మించాడు. అయినా ప్ర‌తి వ‌ర్షాకాలం ఆ బ్రిడ్జి నీటిలో మునిగిపోతుంది. దీంతో న‌ది దాట‌డం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్యకు పర్మినెంట్ పరిష్కారం చేయాలనుకున్నాడు కృష్ణ భట్ కొడుకు భీమేశ్‌..

ఆ నదిని దాటేందుకు రోప్ వే అయితే బెట‌ర్ అనుకున్నాడు. దీంతో సునీల్ అనే ఓ ప్రొఫెస‌ర్ సహాయంతో వ‌ర‌దా న‌దికి అడ్డంగా ఒక పెద్ద బాస్కెట్‌తో రోప్‌వేను నిర్మించారు. ఆ బాస్కెట్‌లో కూర్చొని రోప్‌వే సాయంతో న‌దిని చక్కగా దాటేయొచ్చు. దాని కోసం భ‌ట్ ఫ్యామిలీకి మ‌రో 60 వేల ఖ‌ర్చు పెట్టి మరీ నది దాటానికి శాశ్వ‌త ప‌రిష్కారంగా రోప్ వే..బాస్కెట్ నిర్మించారు.

ఆ రోప్‌వేను కృష్ణభట్ ఒక్కడే కాకుండా గ్రామ‌స్థులు కూడా ఉప‌యోగించుకుంటున్నారు. వ‌ర్షాకాలం వ‌చ్చినా ఆ రోప్‌వే సాయంలో న‌దిని ఈజీగా దాట‌గ‌లుగుతున్నారు. వారి పనులు చేసుకోగలుగుతున్నారు. న‌దిని సుల‌భంగా దాటేలా రోప్‌వే నిర్మించిన భ‌ట్ ఫ్యామిలీకి ఆ ఊరు ప్ర‌జ‌లు హ్యాట్సాప్ చెబుతున్నారు.