ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వ్యాయామాలు చేసేందుకు కార్యచరణ రెడీ అవుతోంది. కేవలం పని ఒత్తిడిని తగ్గించేందుకు యోగా చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయ, యోగా నిపుణుల సాయంతో వై బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. 2020, జనవరి 13వ తేదీ సోమవారం పలు సంస్థల్లో యోగాను నిర్వహించారు. యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగలిగే తేలికమైన వ్యాయామాలుంటాయని అధికారులు వెల్లడించారు.
వై బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని..కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మోడల్ అని తెలిపారు. యోగా ప్రోటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని, వై బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్ లెట్ తయారు చేసినట్లు తెలిపారు. పని స్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించి ఓ వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్‌తో పాటు 15 సంస్థలు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వంటి కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం కార్పొరేట్ కార్యాలయాల్లో యోగా విరామాన్ని అమలు చేయాలని సర్క్యూలర్ జారీ చేసింది. కార్పొరేట్ రంగంలో పనిచేసే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని, అందువల్ల వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చని వెల్లడించారు.
Read More : ఛాటింగ్ చేస్తూ కిందపడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి