Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్స్ షురూ.. భారీ డిస్కౌంట్లతో

ప్రైమ్ మెంబర్స్ కు ఆల్రెడీ అమెజాన్ ఇచ్చే ఆఫర్లు అందుబాటులోకి వచ్చేయగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 3 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది.

Flipkart Big Saving Days: పండుగల సీజన్ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీలన్నీ భారీ డిస్కౌంట్లతో స్పెషల్ సేల్స్ మొదలుపెట్టేశాయి. ప్రైమ్ మెంబర్స్ కు ఆల్రెడీ అమెజాన్ ఇచ్చే ఆఫర్లు అందుబాటులోకి వచ్చేయగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 3 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ మాదిరిగానే ఒక రోజు ముందు ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్ల కోసం ముందే సేల్ మొదలుపెట్టింది ఫ్లిప్‌కార్ట్‌.

ఇందులో భాగంగా ప‌లు స్మార్ట్‌ఫోన్ల‌ు భారీ డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 12, 12 మినీపై స్పెష‌ల్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఐఫోన్ 12(64 జీబీ) ఫోన్‌ కేవలం రూ.49వేల 999కే అందుతుండగా.. ఐఫోన్ 12 మినీ(64జీబీ) ఫోన్‌ రూ.37వేల 999కే దొరుకుతుంది. ఐఫోన్ ఫోన్లను అత్యంత త‌క్కువ ధ‌ర‌కు అమ్మడం ఇదే మొద‌టిసారి.

ఈసేల్‌లో ఈ ఫోన్ల‌పై ఎక్స్ఛేంజ్‌లో రూ.15వేల 800 వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ఎమ్మార్పీ ధ‌ర రూ.39వేల 900పై వచ్చే రాయితీతో క‌లిపి రూ.26వేల 999కే ఫోన్‌ను ఈ సేల్‌లో అందించనున్నారు.

………………………………………….. : నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా.. ఇప్పుడు థియేటర్లలోకి..

కేవలం ఐఫోన్ల‌ు మాత్రమే కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ు ప్ర‌క‌టించారు. Google Pixel 4a, Poco X‌3 pro, Motorola edge 20 fusion స్మార్ట్‌ఫోన్ల మీద ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు