Gopichand : నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా.. ఇప్పుడు థియేటర్లలోకి..

 చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు ఏవేవో కారణాలతో రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుంటాయి. కొన్ని సినిమాలు గొడవల వల్లో, కొన్ని సినిమాలు మనీ

Gopichand : నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా.. ఇప్పుడు థియేటర్లలోకి..

Gopichand] (1)

Gopichand :  చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు ఏవేవో కారణాలతో రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుంటాయి. కొన్ని సినిమాలు గొడవల వల్లో, కొన్ని సినిమాలు మనీ ప్రాబ్లమ్స్ వల్లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోతాయి. అలా ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటికి ఎప్పటికో మోక్షం లభిస్తే రిలీజ్ అవుతాయి. కానీ అప్పటికే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ పోతుంది. హీరో గోపీచంద్ కి కూడా ఇలాంటి ఒక సినిమా ఉంది.

తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ గోపీచంద్ తో కలిసి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని 2017లో తీశారు. ఈ సినిమా పేరు ‘ఆరడుగులు బుల్లెట్’. ఈ సినిమా 2017లోనే రిలీజ్ అవ్వాలి కానీ ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కరోనా టైంలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చినా అది కూడా నిజం కాలేదు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకు ఇప్పటిదాకా అడుగడున ఏదో ఒక అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.

Rashmika Mandanna : అండర్వేర్ యాడ్ లో రష్మిక.. ఈ యాడ్ ఎలా చేశావంటూ భారీ ట్రోలింగ్

తాజాగా ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగినపోయినట్టు ఈ చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ వెల్లడించారు. ఈ సినిమా విడుదలకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ కూడా తొలిగిపోయినట్టు తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాని జీ వాళ్ళు 8 కోట్లకు శాటిలైట్, డిజిటల్ హక్కులని కొనుక్కున్నారు. థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోపే ఈ సినిమాను జీ 5 ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి మాటలు రాశారు. మణిశర్మ సంగీతం అందించారు. మొత్తంగా నాలుగేళ్లుగా ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రాబోతుంది. ఇటీవలే సీటిమార్ తో మాస్ హిట్ కొట్టిన గోపీచంద్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.