కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ కన్నుమూత

  • Publish Date - November 27, 2019 / 07:24 AM IST

కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్  బుధవారం (నవంబర్ 27)ఉదయం కన్నుమూశారు. 79 ఏళ్ల సుశీల్ కుమార్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీస‌ర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత నేవీ చీఫ్ గా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు.

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయితో నేవీ చీఫ్ గా తనకున్న మరచిపోలేని స్మృతులపై సుశీల్ కుమార్ “A Prime Minister to Remember- Memories of a Military Chief” అనే పుస్తకం రాశారు. 1998 నుంచి 2001 వరకు నేవీ చీఫ్ గా పనిచేసారు. సుశీల్ కుమార్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 

హైడ్రోగ్ర‌ఫీ, యాంఫీబియ‌స్ వార్‌ఫేర్‌లో ఆయ‌న చక్కటి పట్టు ఉన్న వ్యక్తి. 1961లో జ‌రిగిన గోవా అక్ర‌మ‌ణ‌లో ఆయ‌న పాల్గొన్నారు. 1965, 1971లో జ‌రిగిన ఇండోపాక్ యుద్ధంలోనూ ఆయన  పాల్గొన్నారు.