అలా చేస్తే వెనక్కి తగ్గి నేను సైలెంట్ అయిపోతానని అనుకున్నారు: ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

"నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థిని. నేను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించను. నాపై ఏవేవో ముద్రలు వేస్తున్నారు. నాపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారు" అని చెప్పారు.

అలా చేస్తే వెనక్కి తగ్గి నేను సైలెంట్ అయిపోతానని అనుకున్నారు: ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

Justice Sudershan Reddy

Updated On : September 1, 2025 / 3:38 PM IST

ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందని ఇండియా బ్లాక్‌ ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం అత్యున్నత వ్యవస్థ అని చెప్పారు. ఈ దేశంలోని ప్రజలు ముందు ఓటర్లు, తర్వాతనే పౌరులు అయ్యారని అన్నారు. ఓటరు లిస్ట్ చిత్తు కాగితం అనుకుంటున్నారని సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటరు లిస్టులో ఇష్టం ఉన్న వారి పేరును రాస్తాం, ఇష్టంలేని వాళ్ల పేర్లు రాయమంటే ఎలా? అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలదీశారు. మెజారిటీ ఉంది కాబట్టి చట్టం చేస్తాం అంటే ఎలా? అని నిలదీశారు.

“నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థిని. నేను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించను. నాపై ఏవేవో ముద్రలు వేస్తున్నారు. నాకు అస్సలు బాధగా లేదు. నాపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారు.

నన్ను విమర్శించే వారు నేను ఇచ్చిన తీర్పు చదవండి. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలి. అది నా తీర్పు కాదు కోర్టు తీర్పు. నా తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారు.

Also Read: ఆ వాహనాలకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.. సుప్రీంకోర్టు తీర్పు..

అందులో ఒక్క కామాను కూడా మార్చలేకపోయారు. రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరముంది. ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు.

నేను ప్రతి ఎన్నికల్లో పాల్గొని నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. పౌరహక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి నేను మాట్లాడతాను. రాజకీయ ముళ్లకిరీటం ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని కొందరు అడుగుతున్నారు.

వాళ్లందరికీ రాజ్యాంగాన్ని పట్టుకుని సమాధానం చెబుతున్నాను. ఉప రాష్ట్రపతి పదవి రాజకీయపరమైన పదవి కాదు. 5 సార్లు రాజ్యాంగంపై ప్రమాణం చేశాను. రాజ్యాంగానికి బద్ధుడినై ఉండడమే కాదు, కాపాడడం నా బాధ్యత. ఆదేశిక సూత్రాలను పాటించే వ్యక్తిని నేను” అని తెలిపారు.