Anju Sehwag : కాంగ్రెస్ కు షాక్..ఆప్ లో చేరిన సెహ్వాగ్ సోదరి

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్

Sehwag Sister

Anju Sehwag : టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఆమె ఆప్ కండువా కప్పుకున్నారు. ఆప్ నేత‌లు ఆమెకు కండువా క‌ప్పి సాధార‌ణంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో హిందీ టీచర్‌గా పని చేసిన అంజు.. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. అంజు సెహ్వాగ్ 2012 ఢిల్లీ MCD ఎన్నికల్లో దక్షిణపురి ఎక్స్‌టెన్షన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన సోదరి(అంజూ) తరఫున ప్రచారం చేశారు. అయితే ఆనాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన ఆమె.. తాజాగా ఆ పార్టీకి షాకిచ్చి ఆప్‌లో చేరారు.

ALSO READ Gang Rape In MP : దివ్యాంగ బాలికపై గ్యాంగ్ రేప్..ఇద్దరు అరెస్ట్