Gang Rape In MP : దివ్యాంగ బాలికపై గ్యాంగ్ రేప్..ఇద్దరు అరెస్ట్

మధ్యప్రదేశ్​ లో దారుణం జరిగింది. 14ఏళ్ల దివ్యాంగ, దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి

Gang Rape In MP : దివ్యాంగ బాలికపై గ్యాంగ్ రేప్..ఇద్దరు అరెస్ట్

Gangrape

Gang Rape In MP : మధ్యప్రదేశ్​ లో దారుణం జరిగింది. 14ఏళ్ల దివ్యాంగ, దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు.

కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అరున్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం…మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాకు చెందిన 14 దివ్యాంగ, దళిత బాలిక మంగళవారం అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన అంగన్​వాడీ కార్యకర్త.. ఆశా వర్కర్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె బాలికను భగోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. బాలిక పరిస్థితిని చూసిన డాక్టర్లు మవూ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో బాలికకు మెడికల్ టెస్ట్ లు చేస్తే అసలు విషయం బయటపడింది.

బాలిక నాలుగు నెలల గర్భవతి అని మెడికల్ టెస్ట్ లలో తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. బుధవారం రాత్రి గుర్తు తెలియని నిందితులపై భారత శిక్షాస్మృతి (IPC),లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద సామూహిక అత్యాచారం కేసు నమోదు చేయబడింది. ఆ తర్వాత సంజ్ఞల నిపుణుడ్ని తీసుకొచ్చి బాలికతో నిందితుల వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిలో ఓ వ్యక్తి బాలిక పొరుగింట్లోనే ఉంటున్నట్లు తెలుసుకుని అతనితో పాటు 60 ఏళ్ల వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి పేర్లు శివ(45), చేతన్(60) అని అరున్ సోలంకి తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారి సోలంకి తెలిపారు. మవూ ASP పునీత్ గెహ్లాట్ మాట్లాడుతూ.. సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని మరియు నేరానికి నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

కాగా,బాధిత బాలిక తల్లి కూడా దివ్యాంగురాలేనని,కొద్ది సంవత్సరాల క్రితం బాలిక తండ్రి మరణించాడని అంగన్ వాడీ వర్కర్ తెలిపారు.

ALSO READ Vangaveeti Radha : వంగవీటి రాధా హత్యకు రెక్కీ..? ఆధారాలు దొరకలేదన్న విజయవాడ సీపీ