Vangaveeti Radha : వంగవీటి రాధా హత్యకు రెక్కీ..? ఆధారాలు దొరకలేదన్న విజయవాడ సీపీ

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? లేదా? ఇది నిర్ధారించేందుకు రెండు నెలల కిందట సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. అయితే,

Vangaveeti Radha : వంగవీటి రాధా హత్యకు రెక్కీ..? ఆధారాలు దొరకలేదన్న విజయవాడ సీపీ

Vangaveeti Radha

Vangaveeti Radha : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? లేదా? ఇది నిర్ధారించేందుకు రెండు నెలల కిందట సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. అయితే, రెక్కీ నిర్వహించారనే విషయమై ఇంతవరకు నిర్ధిష్టమైన ఆధారాలు లభించలేదన్నారు. అదే సమయంలో రాధా భద్రతపై వస్తున్న అనుమానాలపై స్పందించిన సీపీ రాణా, ఈ విషయంలో ఊహాగానాలను ప్రచారం చేయొద్దన్నారు. రాధాకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని తేల్చి చెప్పారు.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

శుక్రవారం వియవాడలోని తన కార్యాలయంలో సీపీ రాణా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రెక్కీ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు. రెక్కీ ఘటనకు సంబంధించి రెండు నెలల సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు.

ఈ నెల 26న గుడివాడలో నిర్వహించిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో పాల్గొన్న వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వంగవీటి రాధాకు భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు. మరోవైపు వంగవీటి రాధా ఇంటి సమీపంలోనే ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఉన్న స్కూటీని ఆయన అనుచరులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధా మంచి స్నేహితులు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా వీరి మధ్య స్నేహం కొనసాగింది. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.