Inderjeet Singh : బీజేపీలో చేరిన మాజీ రాష్ట్రపతి మనవడు

భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్​ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు.

Inderjeet Singh భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్​ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. వచ్చే ఏడాది పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఇంద్రజిత్​ సింగ్ కాషాయ కండువా పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఇంద్రజిత్. తన తాత జ్ఞానీ సింగ్ కాంగ్రెస్​ పార్టీకి ఎంతో విధేయతతో పని చేశారని, కానీ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు చూసి తన తాత చాలా బాధపడ్డారని సింగ్ ఆరోపించారు. తన తాత మరణంపైనా సందేహాలున్నాయని అన్నారు. ఆయన యాక్సిడెంట్​లో చనిపోయారని, కానీ అది ప్రమాదమా.. హత్యా కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.

రాజకీయాల్లో చేరాలన్న తన కోరిక చెప్పినప్పుడు, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీల ఆశీర్వాదం తీసుకోమని నా తాత జైల్‌ సింగ్‌ చెప్పారని ఇందర్‌జీత్‌ సింగ్‌ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మదన్ లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ పార్టీలో చేరకుండానే ఆయన కోసం ప్రచారం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఈ రోజు బీజేపీలో చేరడంపై తాను తీసుకున్న ఈ నిర్ణయంపై తన తాత చాలా సంతోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

READ Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

ట్రెండింగ్ వార్తలు