Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

Gujarat

Gujarat CM గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. గాంధీనగర్​లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రమాణస్వీకారానికి ముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని గాంధీనగర్​లోని అయన నివాసంలో కలిశారు భూపేంద్ర పటేల్. వివిధ అంశాలపై ఇరువురూ చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్​ను కూడా భూపేంద్ర పటేల్ కలిశారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా 

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆదివారం బీజేపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశమై భూపేంద్ర ప‌టేల్‌ను నూత‌న ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్న‌ విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర భాయ్ పటేల్ అనూహ్యంగా గుజరాత్ కొత్త సీఎంగా ఎంపికకావడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఆయన్ను ఎంపిక చేయడానికి భాజపా వద్ద బదలమైన కారణమే ఉంది. సున్నిత స్వభావం.. కారణంగా ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

భూపేంద్ర పటేల్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1 లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శశికాంత్ పటేల్‌పై ఆయన గెలుపొందారు. 2017 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపుపొందిన నాయకుడు కూడా భూపేంద్ర పటేల్ కావడం విశేషం. ఆనందిబెన్ పటేల్ గవర్నర్‌గా నియమితురాలు కావడానికి ముందు 2012లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

భూపేంద్రను ‘దాదా’ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన మద్దతుదారులు. ప్రజలతో మంచి బంధం ఉండటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయి.

సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన భూపేంద్ర పటేల్ కి… ఆనందిబెన్ పటేల్ సన్నిహితుడిగా కూడా పేరుంది. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన ఆయన అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు