Mulayam Singh Yadav Health : ములాయం సింగ్‌ యాదవ్ ఆరోగ్యం విషమం..ఐసీయూలో చికిత్స

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్(82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Mulayam Singh Yadav Health health : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్(82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి అయిన ములాయం సింగ్‌ యాదవ్‌ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం వల్ల గత కొన్నేళ్లుగా ఆయన ప్రజల్లోకి రాలేదు.

కాగా, ములాయం సింగ్‌ యాదవ్‌ కొన్ని వారాలుగా మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐపీయూ వార్డులో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్‌ సుశీల కటారియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Terrorist Attack: కాశ్మీర్‌లో తీవ్రవాద దాడి.. పోలీసు మృతి.. జవానుకు గాయాలు

విషయం తెలిసిన వెంటనే ఎస్పీ చీఫ్‌, ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ వెంటనే యూపీ నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఢిల్లీ సమీపంలో ఉన్న మేదాంత హాస్పిటల్‌కు బయలుదేరారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు