ఆపరేషన్‘Meghdoot’కు సారధ్యం : ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రేమనాథ్ హూన్ కన్నుమూత

  • Publish Date - January 7, 2020 / 06:31 AM IST

1984లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జన్ రల్ ప్రేమనాథ్ హూన్ సోమవారం (జనవరి 6) సాయంత్రం తన 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ప్రేమనాథ్ గత కొంతకాలంగా బాధపడుతూ..పచంకులాలోని చండిమందిర్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం 5.30 గంటలకు కన్నుమూశారు.  

1929 అక్టోబర్ 4న జన్మించిన ప్రేమనాథ్ భారత సైన్యంలో చేరారు.పలు సేవలు చేశారు. కశ్మీర్ ప్రాంతంలో సియాచిన్ హిమనీనదంపై పాక్ పట్టు సాధించటానికి యత్నించింది. కానీ భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ ఆపరేషణ్ లో ప్రేమనాథ్ హూన్ కీలక పాత్ర వహించారు. భారత సాయుధ దళాల ఆపరేషన్ ‘మేఘతూట్’ కు ప్రేమనాథ్ నాయకత్వం వహించారు. ఈ ఘటన సియాసిన్ సంఘర్షణకు దారి తీసింది. ఈ చర్య ఫలితంగా భారత దళాలు మొత్తం సియాచిన్ హిమనీనదంపై నియంత్రణ సాధించాయి.