Babita Phogat: ‘దంగల్’ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ రెజ్లర్ బబిత ఫొగట్

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘దంగల్’ ఒకటి. మాజీ రెజ్లర్ బబితా ఫొగట్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Babita Phogat: ‘దంగల్’ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ రెజ్లర్ బబిత ఫొగట్

Babita Phogat

Updated On : October 23, 2024 / 2:42 PM IST

Dangal Movie: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘దంగల్’ ఒకటి. మాజీ రెజ్లర్ బబితా ఫొగట్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటించారు. తాజాగా ఈ సినిమా గురించి బబితా ఫొగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 24 న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబిత ఫొగట్ మాట్లాడుతూ.. దంగల్ సినిమా దాదాపు రెండు వేల కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే.. తన కుటుంబానికి కోటి రూపాయిలు మాత్రమే అందాయని అన్నారు.

Also Read: వినేశ్ ఫొగాట్ పై సాక్షిమాలిక్ సంచలన ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

అయినప్పటికీ నేను దీని గురించి మాట్లాడలేదు. తన తండ్రి బోధించిన విధంగా ప్రజల ప్రేమ, గౌరవానికి విలువనిస్తూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేయలేదని బబిత ఫొగట్ పేర్కొన్నారు. దంగల్ సినిమాకు నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. 2016 డిసెంబర్ 23న ఈ సినిమా విడుదలైంది. అమీర్ ఖాన్ మహావీర్ ఫొగట్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా.. తన కుమార్తెలు గీత, బబితా ఫొగట్ లను ప్రపంచ స్థాయి రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి మాజీ రెజ్లర్ మహావీర్ ఫొగట్ చేసిన కృషికి సంబంధించిన చిత్రమిది.