boulder slides down hill
Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో కురుస్తున్న భారీవర్షాల వల్ల బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. (push truck into gorge) బనిహాల్ ప్రాంతంలోని షేర్ బీబీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ట్రక్కును భారీ బండరాయి ఢీకొట్టి రోడ్డుపై నుంచి జారిపడిందని అధికారి తెలిపారు. (boulder slides down hill)
IMD Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు…యూపీలో 19 మంది మృతి
ట్రక్కు లోతైన లోయలో పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని ఆయన తెలిపారు. (Jammu And Kashmir) ఈ ప్రమాదంలో ఇంటి అవసరాల కోసం ట్రక్కులో తరలిస్తున్న ఆరు పశువులు కూడా మృతి చెందినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు మృతదేహాలను వెలికితీశారు.
COVID-19 : ఢిల్లీలో ప్రబలుతున్న కొవిడ్ పిరోలా వేరియంట్.. పెరిగిన వైరల్ ఫీవర్ కేసులు
మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కిష్త్వారీ పథేర్ బనిహాల్ వద్ద కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. ట్రాఫిక్ రెండు చివర్లలో నిలిపివేశారు. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ల నుంచి నిర్ధారణ లేకుండా ప్రజలు జాతీయ రహదారి-44పై ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.