women constables suspend
Women Constables Suspend : అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్ పూర్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు
దీంతో ఆ నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ రిపోర్టు ఆధారంగా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్ లను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ సస్పెండ్ చేశారు.