Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు

అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తైంది. రూ.1,800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.

Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు

Updated On : October 26, 2022 / 5:55 PM IST

Ayodhya Temple: అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణాన్ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. తాజాగా ఈ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

2024, మకర సంక్రాంతి నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఆలయాన్ని రూ.1,800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయం కనీసం 1,000 సంవత్సరాల వరకు నిలిచి ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తైంది. గుడిలో మొత్తం 392 స్తంభాలు, 12 ద్వారాలు ఉంటాయి. వీటి నిర్మాణంలో ఐరన్ రాడ్స్ ఉపయోగించడం లేదు. కాపర్ చిప్స్, రాళ్లనే ఉపయోగిస్తున్నారు. ప్రధాన గర్భగుడి 160 స్తంభాలు కలిగి ఉంటుంది. ఇందులో మొదటి ఫ్లోర్‌లో 82 పిల్లర్లు ఉంటాయి.

Navjit Kaur Brar: కెనడాలో కొత్త చరిత్ర.. సిటీ కౌన్సిలర్‌గా నవ్‌జిత్ కౌర్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి సిక్కు మహిళగా రికార్డు

ఈ నిర్మాణానికి 12 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటిని టేకు కలపతో నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయం 350×250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అలాగే దేవాలయం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఇతర ఆస్తుల వివరాల్ని కూడా సేకరిస్తున్నారు. 2.7 ఎకరాల స్థలంలో నిర్మితమవుతున్న ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేక గ్రానైట్ రాయిని తెప్పించారు.