Navjit Kaur Brar: కెనడాలో కొత్త చరిత్ర.. సిటీ కౌన్సిలర్‌గా నవ్‌జిత్ కౌర్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి సిక్కు మహిళగా రికార్డు

కెనడాలో భారత సంతతి మహిళ సంచలనం సృష్టించారు. బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా సిక్కు మహిళ నవ్‌జిత్ కౌర్ బ్రార్ ఎన్నికయ్యారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి తలపాగా చుట్టుకున్న సిక్కు మహిళగా నిలిచారు.

Navjit Kaur Brar: కెనడాలో కొత్త చరిత్ర.. సిటీ కౌన్సిలర్‌గా నవ్‌జిత్ కౌర్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి సిక్కు మహిళగా రికార్డు

Navjit Kaur Brar: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునక్ ఎంపికైన సమయంలోనే దేశం గర్వించే మరో సంఘటన చోటు చేసుకుంది. భారత మూలాలున్న సిక్కు మహిళ కెనడాలోని ఒక పట్టణానికి కౌన్సిలర్‌గా ఎన్నికైంది.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నవ్‌జిత్ కౌర్ బ్రార్ అనే సిక్కు మహిళ బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా గెలిచారు. కెనడాలో ఒక సిటీ కౌన్సిలర్‌గా తలపాగా చుట్టుకునే సిక్కు మహిళ ఎన్నికవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఘతన సాధించిన తొలి సిక్కు మహిళగా నవ్‌జిత్ కౌర్ బ్రార్ సంచలనం సృష్టించారు. నవ్‌జిత్ కౌర్ బ్రార్ రెస్పిరేటరీ థెరపిస్టుగా పని చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. బ్రాంప్టన్ నగరంలోని ఎంపీకి పోటీ పడుతున్న జెర్మైన్ ఛాంబర్స్ అనే వ్యక్తిపై నవ్‌జిత్ కౌర్ విజయం సాధించి, ఏకంగా రెండు వార్డుల్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలో ఆమెకు అత్యధికంగా 28.85 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆమె సమీప ప్రత్యర్థులకు 22.59 శాతం, 15.41 శాతం ఓట్లు పోలయ్యాయి.

Ghaziabad: పార్కింగ్ విషయంలో గొడవ.. తలపై ఇటుకతో కొట్టి వ్యక్తి హత్య.. వీడియోలో రికార్డైన ఘటన

నవ్‌జిత్ కౌర్ బ్రార్ గెలుపుపై బ్రాంప్టన్ నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక కోసం ఆమె చాలా కష్టపడ్డారు. విపరీతంగా ప్రచారం చేశారు. గత రెండు నెలల్లో 40,000కుపైగా ఇండ్లకు వెళ్లి, 22,500 మందికిపైగా పౌరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవ్‌జిత్ కౌర్ బ్రార్ మాట్లాడుతూ తనను ఎన్నుకున్న పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.