Free Ration Scheme : పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచిత రేషన్ పథకం మరో 6 నెలలు పొడిగింపు

పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా..

Free Ration Scheme

Free Ration Scheme : పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగించింది. మరో ఆరు నెలలు ఈ స్కీమ్ అమలు కానుంది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘‘భారత దేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆరు నెలల పాటు అంటే సెప్టెంబర్‌ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకు ముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని ప్రధాని కోరారు.

Free Ration : ఉచిత రేషన్ పథకం పొడిగింపు.. ఎన్ని నెలలంటే

ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తోంది. 2020 ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. మార్చి నెలాఖరుతో దీనికి గడువు ముగియనున్న వేళ శనివారం కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం పీఎంజీకేఏవై పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కాగా, ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ తొలుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండోసారి సీఎం కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఉచిత రేషన్‌ను పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతలో.. ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప‌థ‌కాన్ని ఆరు నెల‌ల పాటు పొడిగించ‌డంతో యూపీ ప్రభుత్వంపై ఈ ప‌థ‌కం భారం ప‌డ‌దు.

యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకుంది బీజేపీ. దీంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడంతో.. కొన్ని పథకాలను కొనసాగించాలని సీఎం యోగి నిర్ణయించుకున్నారు. మంత్రి మండలి మొదటి మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను పొడిగించాలని నిర్ణయించారు.