auto-rickshaw drivers
Karnataka Shakti Scheme: కర్ణాటక (Karnataka) లో ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర ప్రజలకు పలు హామీలను ఇచ్చింది. వీటిలో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం. ఇందుకోసం శక్తి పథకాన్ని ఇటీవల సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు. దీంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు తెగ వాడేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో సీటుకోసం మహిళలు జట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shakti Scheme: కర్ణాటకను మార్చేసిన ఉచిత బస్సు ప్రయాణం.. కిటకిటలాడుతున్న ఆలయాలు, వెలవెలబోతున్న రైళ్లు
కర్ణాటక రాష్ట్రంలో శక్తి పథకం ఆటో డ్రైవర్లకు కష్టాలను మిగిల్చింది. పది రోజుల వ్యవధిలోనే వారి వ్యాపారం 20శాతం క్షీణించిందట. రైడ్ హెయిలింగ్ అప్లికేషన్ల ద్వారా సేవలను అందించే చాలా మంది డ్రైవర్లు పీక్ అవర్స్‌లో వచ్చే ఆర్డర్ల సంఖ్యసైతం గణనీయంగా తగ్గిందని వాపోతున్నారు. దొరెస్వామి అనే ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. శక్తి పథకంకు ముందు నాకు రోజుకు పదుల సంఖ్యలో రిక్వెస్ట్‌లు వచ్చేవి. ఇప్పుడు నాకు రెండు లేదా మూడు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
Karnataka Politics: ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే మరో సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ శక్తి పథకం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కేవలం నేను రూ.40 మాత్రమే సంపాదించాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. శక్తి పథకాన్ని తొలగించాలి. లేకుంటే దానికి తగ్గట్టుగా మాకు మరో కొత్త పథకాన్ని అమలు చేయాలంటూ ఆటో డ్రైవర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka.
Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8— Zavier (@ZavierIndia) June 25, 2023