Shakti Scheme: కర్ణాటకను మార్చేసిన ఉచిత బస్సు ప్రయాణం.. కిటకిటలాడుతున్న ఆలయాలు, వెలవెలబోతున్న రైళ్లు

మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.

Shakti Scheme: కర్ణాటకను మార్చేసిన ఉచిత బస్సు ప్రయాణం.. కిటకిటలాడుతున్న ఆలయాలు, వెలవెలబోతున్న రైళ్లు

Updated On : June 19, 2023 / 9:12 PM IST

Karnataka: వారం రోజుల క్రితం వరకు మామూలుగా ఉన్న ఆర్టీసీ బస్సులు, ప్రస్తుతం రద్దీతో కుదేలవుతున్నాయి. ఆలయాలు కిటకిటలాడుతున్నాయి, రైళ్లు వెలవెలబోతున్నాయి. ఏ బస్సులో చూసినా మహిళలే. ఏ బస్టాండులో చూసినా బస్సు కోసం ఎదురు చూస్తోన్న మహిళలే. బస్టాండులోకి బస్సు రాగానే మెయిన్ డోర్ నుంచే కాకుండా, డ్రైవర్ డోర్, ఎమర్జెన్సీ డోర్ నుంచి సైతం ఎక్కేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ ఇది.

Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించిన గ్యారెంటీలలో ఒక్కటైన శక్తి పథకం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి గ్యారెంటీగా మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, వాయువ్య కర్ణాటక, కల్యాణ కర్ణాటక పేరిట నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఈ కార్పొరేషన్ల పరిధిలోని బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. నాలుగు కార్పొరేషన్ల ద్వారా రోజూ 70-80 లక్షల మంది ప్రయాణాలు సాగించేవారు. అయితే ఉచిత బస్సు ప్రయాణంతో రోజూ ప్రయాణికుల సంఖ్య కోటి దాటిపోయిందట. ఇందులో 90 శాతం మహిళలే అని వేరే చెప్పనక్కర్లేదు.

Shivsena vs Shivsena: మొదటిసారి రెండు వ్యవస్థాపక దినోత్సవాలు.. బాల్ థాకరే మరణం తర్వాత కుదేలైనా శివసేన

శక్తి గ్యారెంటీ సాధారణ సర్వీసులకు మాత్రమే వర్తింప చేయడంతో మహిళలు సాధారణ సర్వీసుల్లోనే తిరుగుతున్నారు. దీంతో ఏసీ సర్వీస్ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది. వీటిలో ఎక్కువ రాత్రి సర్వీసులు ఉండడం, గ్యారెంటీ వర్తించకపోవడంతో ప్రయాణికులు తగ్గారు. 39 సీట్లు కల్గిన రాజహంస, ఓల్వోలలో సాధారణంగా 30-35 మంది ప్రయాణించేవారు. వారం రోజులుగా ఆ సంఖ్య 20లోపే ఉంది. ఏళ్ల తరబడి ఏసీ సర్వీసులు పరిశీలిస్తే వారాంతంలో రద్దీగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదట. ఇక మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.

Ola Electric EV portfolio : ఓలా నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జూలైలోనే లాంచ్.. ముందే హింట్ ఇచ్చిన కంపెనీ సీఈఓ..!

బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండడంతో రాష్ట్రంలో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో యథావిధి రద్దీనే ఉన్నప్పటికీ.. మెమో, డెమోతోపాటు బెంగళూరు నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు తగ్గారట. రోజులో 35 వేలకు పైగా టికెట్ల అమ్మకం తగ్గిపోయిందని రైల్వే పేర్కొంది. ఇవిలా ఉంటే.. మరొక పక్క ఆలయాలు మాత్రం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ దర్శనాలకు పదింతలకుపైగా భక్తులు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ధర్మస్థళలో శని, ఆదివారాలలో లక్ష మంది చొప్పున దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది.