Shivsena vs Shivsena: మొదటిసారి రెండు వ్యవస్థాపక దినోత్సవాలు.. బాల్ థాకరే మరణం తర్వాత కుదేలైనా శివసేన

పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లాడేవారు. రెచ్చగొట్టే ధోరణి ఎక్కువ. అయితే ఆయన ఎప్పుడూ మరాఠీ ప్రజల కోసమే మాట్లాడేవారు

Shivsena vs Shivsena: మొదటిసారి రెండు వ్యవస్థాపక దినోత్సవాలు.. బాల్ థాకరే మరణం తర్వాత కుదేలైనా శివసేన

Maharashtra Politics: శివసేన పార్టీని స్థాపంచి 57 ఏళ్లు పూర్తైంది. 1966లో ఇదే రోజున (జూన్ 19) బాల్ థాకరే ఆ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఆ పార్టీ మారిపోయింది. ముఖ్యంగా ముంబైలో శివసేన ఎంత చెప్తే అంత అనే పరిస్థితి దాదాపుగా బాల్ థాకరే మరణం వరకూ ఉంది. మహారాష్ట్రలో ఎదురులేని పార్టీగా పెత్తనం చెలాయించిన ఆ పార్టీ సొంతంగా ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కరెక్టుగా చెప్పాలంటే పశ్చిమ మహారాష్ట్రను దాటి కూడా ప్రభావం చూపలేకపోయింది.

Ravindra Jadeja : జ‌డేజాను మాయ చేసింది.. ప‌బ్లిక్‌గానే క్ర‌ష్ నుంచి ప్ర‌మోష‌న్ ఇచ్చి మ‌రీ..

బాల్ థాకరే బతికి ఉండగా, శివసేన నుంచి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని 2019 ఎన్నికల అనంతరం ఉద్ధవ్ థాకరే పూర్తి చేసినప్పటికీ.. అదే ఆ పార్టీకి పెద్ద విపత్తులా మారింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు నచ్చలేదనే కారణంతో ఆ పార్టీ నుంచి ఏక్‭నాథ్ షిండే వర్గం విడిపోయింది. పార్టీ స్థాపించిన ఆరు దశాబ్దాలు కావస్తున్న తరుణంలో ఆ పార్టీ మొదటిసారి రెండు వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకుంటోంది. అటు ఉద్ధవ్ థాకరే వర్గం, ఇటు ఏక్‭నాథ్ షిండే వర్గం పోటాపోటీగా వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నాయి.

శివసేన ఆవిర్భావం..
బాల్ థాకరే మహారాష్ట్రలో చాలా మందికి దేవుడితో సమానం. 60 ఏళ్ల క్రితం ముంబైలోని మరాఠీలపై గుజరాతీలు, దక్షిణ భారతీయులు పెత్తనం చూపిస్తుండేవారు. అయితే ముంబైలో ఉండే మరాఠీల తరపున బాల్ థాకరే నిలబడ్డారు, వారి కోసం పోరాడారు, వారికి నాయకుడు అయ్యారు. అప్పటికి ముంబై, మహారాష్ట్ర వేరుగా ఉండేవి. అయితే బాల్ థాకరే సుదీర్ఘ పోరాటం అనంతరం ఎట్టకేలకు మహారాష్ట్రలో ముంబై చేరింది. అనంతరం థాకరే మొత్తం మహారాష్ట్ర నాయకుడు అయ్యారు. ఆ తరుణంలోనే మరాఠాల కోసం శివసేన పార్టీని స్థాపించారు.

Viral Video: రెస్టారెంటులో అందరూ చూస్తుండగా సిబ్బంది, ఓ కుటుంబం తన్నులాట.. ఎందుకంటే?

మరాఠీ మాట్లాడేవారి కోసం, మహారాష్ట్రీయుల కోసం ఈ పార్టీ ఏర్పడింది. అయితే బీజేపీతో స్నేహం కారణంగా కాల క్రమంలో హిందుత్వను కూడా బలమైన సిద్ధాంతంగా మార్చుకుంది. బీజేపీలాగే జాతీయవాదాన్ని కూడా తమ సిద్ధాంతంగా మార్చుకుంది. సుదీర్ఘ కాలం పాటు బీజేపీతో స్నేహం చేసింది. అయితే అది 2019లో వికటించింది. ముఖ్యమంత్రి కుర్చీపై వచ్చిన పేచీతో కమలం పార్టీకి బైబై చెప్పింది శివసేన.

శివసేన పార్టీ ఉద్దేశాలు..
శివసేన ప్రాధాన్యం మరాఠీ భాష, మహారాష్ట్ర ప్రజలు. మరాఠీ భాషను రక్షించడం, ప్రచారం చేయడం ఆ పార్టీ ప్రధాన అజెండా. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ముంబైకి వచ్చే.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలపై నియంత్రణ చేపట్టడం. మహారాష్ట్ర సాంస్కృతిక గుర్తింపు, వలస వచ్చిన వారికి కాకుండా స్థానికులకే ఉద్యోగాలు. ఆ పార్టీ పెట్టిన కొత్తలో శివసేన ఇచ్చిన ప్రధాన హామీలు ఇవి. శివసేన అంటే మరాఠీ, మహారాష్ట్ర అన్నట్లుగా ఉండేది. అయితే అది రాను రానూ క్షీణించింది.

Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..

ఇక పార్టీ వ్యవస్థాపుడు బాల్ థాకరే గురించి చెప్పుకుంటే.. పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లాడేవారు. రెచ్చగొట్టే ధోరణి ఎక్కువ. అయితే ఆయన ఎప్పుడూ మరాఠీ ప్రజల కోసమే మాట్లాడేవారు. నిజానికి ఎప్పుడూ వివాదస్పదంగా ఉండే థాకరే మనోహరమైన వ్యక్తని ఆయన సన్నిహితులు అంటారు. థాకరే చేసిన సాంఘీక, రాజకీయ పోరాటాలు మరాఠాలపై చెరగని ముద్రవేశాయి.

Aurangzeb: ఔరంగజేబ్‌ని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది.. అసలేంటీ వివాదం?

అయితే థాకరే మరణం అనంతరం శివసేన పార్టీలో పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన 2012లో ఆయన మరణించగా.. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే.. బీజేపీతో పొత్తు తెంచుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం పొత్తు పునరుద్ధరించుకున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీపై వచ్చిన తగాదా కారణంగా బీజేపీపై తిరుగుబాటు చేసి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు. మూడేళ్ల ప్రభుత్వం నడిపిన అనంతరం శివసేనలో ఎప్పటి నుంచో ఉన్న ఏక్‭నాథ్ షిండే, మెజారిటీ ఎమ్మెల్యేలను బయటికి లాగి బీజేపీతో చేతులు కలిపారు.

Chandrababu : 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండీ .. లేదంటే తప్పుకోండీ : చంద్రబాబు వార్నింగ్

అటు ఉద్ధవ్ థాకరే, ఇటు ఏక్‭నాథ్ షిండే పార్టీ తమదంటే తమదేనని తీవ్రంగా తలపడ్డారు. అయితే తొలుత ఇద్దరికీ అదే పేరు వచ్చేలా రెండు పార్టీలు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కొద్ది రోజులకే మెజారిటీ శాసన సభ్యులను దృష్టిలో పెట్టుకుని షిండే వర్గానిదే అసలైన శివసేన అని గుర్తింపునిచ్చింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఒకే పార్టీగా ఉన్న ఉన్నట్టుండి రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆ పార్టీ చరిత్రలోనే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా శివసేన భవితవ్యం తెలుస్తుంది.