Fuel Prices Hiked After Two Day Pause
Fuel Price Hike : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. జూన్ నెలలో రెండోసారి ధరలు పెరిగినట్లైంది. మే నెలలో 16 సార్లు పెట్రోల్, డీజల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. 18 సార్ల పెరుగుదలలో ఇప్పటి వరకు పెట్రోల్ పై రూ.4.36 డీజిల్ పై రూ. 4.93 పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 94.76 డీజిల్ రూ. 85.66.
– ముంబయిలో పెట్రోల్ లీటరు రూ. 101.19 ,డీజిల్ రూ. 93.09.
– చెన్నై లో పెట్రోలు రూ.96.92 డీజిల్ రూ. 90.38.
– కోల్ కతా లో పెట్రోలు రూ.94.76 డీజిల్ రూ. 88.51.
– హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 98.48, లీటర్ డీజిల్ ధర రూ. 93.38గా ఉంది.
– విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.89 ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 95.15గా ఉంది.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలుచోట్ల రూ.100 దాటింది. గత ఏడాది కాలంలో పెట్రోల్ లీటరుకు సుమారు 27 రూపాయలు, 24 రూపాయలు డీజిల్ ధర పెరిగింది. కరోనా వైరస్ తో సతమతమౌతుంటే..పెట్రోల్ ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read More : Jobs : టెన్త్ అర్హతతో ఎయిర్‌టెల్‌లో ఉద్యోగాలు