Jobs : టెన్త్ అర్హతతో ఎయిర్‌టెల్‌లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది.

Jobs : టెన్త్ అర్హతతో ఎయిర్‌టెల్‌లో ఉద్యోగాలు

Airtel Jobs

Airtel Jobs : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది. సంస్థ నుంచి అనేక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టెన్త్ నుంచి పీజీ వరకు అన్ని విద్యార్హతలు కలిగిన వారి కోసం ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం విశేషం. చిన్న చిన్న కంపెనీల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీని సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అనేకసార్లు నిరుద్యోగులకు వివిధ అంశాలపై కంపెనీలకు కావాల్సిన శిక్షణను ఉచితంగా అందించి ఉద్యోగాలను సైతం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.

ప్రముఖ టెలికాం సంస్థ Airtelలో ఖాళీల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

* మొత్తం 60 ఖాళీలు భర్తీ

* 4G Champ Executive విభాగంలో నియామకాలు చేపట్టారు.

* టెన్త్ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు.

* ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు.

* అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.

* అభ్యర్థులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి.

* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

* రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను సంప్రదించి నియామకాలు చేపడతారు.

* ఎంపికైన వారు వైజాగ్ సిటీ, ఆనందపురం, భీమిలీ, తగరపువలస, సబ్బవరం, పెందుర్తి, గోపాలపట్నం, కోటపాడు, గాజువాక, అనకాపల్లిలో పని చేయాల్సి ఉంటుంది.

* ఇతర వివరాలకు 9908011448, 9100011964 నంబర్లను సంప్రదించవచ్చు.