Fuel Price..Nirmala Sitharan: పెట్రోల్ భారం భరించలేకపోతే..వాళ్లని నిలదీయండీ..:మంత్రి నిర్మలా సీతారామన్

‘పెట్రోలు ధరలు మీకు భారంగా మారాయా. అయితే మీరు ఎవరికైతే ఓట్లు వేసారో..వారిని నిలదీసి ప్రశ్నించండీ’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సలహా ఇచ్చారు.

Fuel Price..Finance Minister Nirmala Sitharaman: ‘పెట్రోలు ధరలు మీకు భారంగా మారాయని మీరు అనుకుంటున్నారా? మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పెట్రోల్, డీజిల్ కే ఖర్చుపెడుతు పెను భారంగా భావిస్తున్నారా? అలా అయితే మీరు ఎవరికైతే ఓట్లు వేసారో..వారిని నిలదీసి ప్రశ్నించండీ’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సలహా ఇచ్చారు. పెట్రో ధరలు మీకు భారంగా అనిపిస్తే.. మీరు ఓటు వేసి ఎన్నుకున్న మీ మీ రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సలహా ఇచ్చారు.

Read more : India : చమురు ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని ప్రజల భారాన్ని తగ్గేలా చేయమని కేంద్రం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలను కోరామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మా విన్నపాన్ని కొన్ని రాష్ట్రాలు అంగీకరించట్లేదని రాష్ట్రాల పన్నులు తగ్గించుకోవటానికి ముఖంగా లేవని మంత్రి తెలిపారు.కాబట్టి పెట్రోలు, డీజిల్ భారాలు తగ్గించాలని ఆయా రాష్ట్రాల ప్రజలు భావిస్తే..మీరు ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిథుల్ని నిలదీసి ప్రశ్నించండీ అంటూ ఆమె సలహా ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం విజ్ఞప్తి మాత్రమే చేయగలదని..నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని.. ఇప్పటికే తాము పన్నులు తగ్గించి పెట్రో ధరలను నియంత్రించాలని రాష్ట్రాలని కోరామని ఈ సందర్భంగా మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ.10లు ఎక్సైజ్ డ్యూటీ (వ్యాట్) తగ్గించడం తెలిసిందే. అన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, మరికొన్ని ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సూచనలు పెడచెవిన పెట్టారు. ఆ వారి విజ్ఞప్తుల్ని తోసిపుచ్చాయి.

Read more : Petrol Prices Today: పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోల్ ధర.. దేశవ్యాప్తంగా రేట్లు ఇవే!

గతంలో పెట్రోల్, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం.. ఇప్పుడు చాలా తక్కువగా మాత్రమే దీన్ని తగ్గించిందని ఆ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తాము వ్యాట్‌ను పెంచలేదని.. అందుకే ఇప్పుడు దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదంటున్నాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోదని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.

 

ట్రెండింగ్ వార్తలు