Chota Ajan
కరోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరణించారు. ఏప్రిల్ 26న కరోనాబారినపడ్డ చోటా రాజన్..ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు.
చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. తొలుత దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్న చోటా రాజన్.. దావూద్ తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొన్నాడు. ఆయనపై 70కి పైగా కేసులు నమోదయ్యాయి. 2015లో ఇండోనేషియాలో చోటా రాజన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. .అప్పటి నుండి భారీ బందోబస్తు మధ్య తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఏప్రిల్-26న ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు అధికారులు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు.