Gen Bipin Rawat Death : 17 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారో తెలుసా ?

గన్ సెల్యూట్ ఎందుకు ? ఎవరికి చేస్తారు ? అంత్యక్రియల్లో తుపాకీ వందనం అంటే..ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారు. కానీ..అందరికీ ఇది వర్తించదు.

17 Guns

17 Gun Salute : భారత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు ? అనేది కొంతమందికి తెలియదు. గన్ సెల్యూట్ ఎందుకు ? ఎవరికి చేస్తారు ? తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంత్యక్రియల్లో తుపాకీ వందనం అంటే..ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారు. కానీ..అందరికీ ఇది వర్తించదు. భారత సైన్యం, యుద్ధం, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారి అంత్యక్రియల్లో కి సైనిక వందనం సమర్పిస్తుంటుంది. న్యాయ, విజ్ఞాన, రాజకీయం, సాహిత్యం కళారంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సం రోజున కూడా గన్ సెల్యూట్ నిర్వహిస్తుంటారు. ఆ రోజున జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు…21 సార్లు తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. గన్ సెల్యూట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది.

Read More : Nayeem Diaries : నయీం డైరీస్ సినిమాలో లిప్ లాక్ సీన్‌‌పై అభ్యంతరం

మాజీ రాష్ట్ర పతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు మరణించిన సమయంలో…ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి…తుపాకీ వందనం సమర్పిస్తారు. భారత రాష్ట్రపతి, మిలటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు 21 తుపాకీ వందనాలు జరుపుతారు. త్రివిధ దళాలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే…17 సార్లు గాల్లోకి కాల్పులు జరుపుతారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం సమర్పిస్తారు. బ్రిటీష్ సామాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది.

Read More : Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

దీనిని భారత చక్రవర్తికి మాత్రమే అందించారు. దేశాధినేత, సౌర్వభౌమాధికారులు, వారి కుటుంబసభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. ప్రతి ఒక్కరిని కలిచివేసింది.