Chandrapur
Chandrapur : మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్గాపూర్ లో విద్యుత్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మహిళలతోపాటు, ఓ వ్యక్తి ఉన్నారు. కాగా దుర్గాపూర్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ సంబాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దుర్గాపూర్ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ తన ఇంట్లో ఉన్న జనరేటర్ స్టార్ట్ చేసి నిద్రపోయాడు. జనరేటర్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ ఇల్లు మొత్తం ఆవరించింది. దీంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. ఉదయం ఏడుగంటలైనా ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు వెళ్లి తలుపు తట్టారు. తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా అరుగురువు విగతజీవులుగా పడి వున్నారు.
వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. జనరేటర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో విడుదల కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.