Goa Assembly Polls : ఉత్పల్ పారికర్ ఎటువైపు ? ఏ పార్టీలో చేరుతారు ?

ఇతర పార్టీలు రెడి అయిపోయాయి. ఆప్..శివసేన పార్టీలు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ పార్టీలోకి రావాలంటూ వెల్ కమ్ చెబుతున్నాయి. దీంతో ఆయన ఏ పార్టీ తరపున...

Utpal Parrikar : బీజేపీ అగ్రనేతల్లో దివంగత మనోహర్ పారికర్ ఒకరు. ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ ఇప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 34 మంది అభ్యర్థులతో తొలి విడుత విడుదల చేసిన లిస్ట్ లో ఉత్పల్ పారికర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన్ను పార్టీ పక్కకు పెట్టిందా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో..ఇతర పార్టీలు రెడి అయిపోయాయి. ఆప్..శివసేన పార్టీలు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ పార్టీలోకి రావాలంటూ వెల్ కమ్ చెబుతున్నాయి. దీంతో ఆయన ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారు ? లేక ఒంటిరిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది తెలియరావడం లేదు.

Read More : Perni Nani: చెప్పుడు మాటలు విని టీచర్లు అసభ్యంగా మాట్లాడటం ధర్మమా?

గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉత్పల్ పారికర్ తండ్రి స్థానమైన పనాజీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ..బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అటనాసియో బాబుష్ కు ఆ నియోజకవర్గ టికెట్ కేటాయించింది. జాబితాలో తన పేరు లేకపోవడం పైగా తాను కోరుకున్న నియోజకవర్గం టికెట్ ఇతరులకు కేటాయించడంపై ఉత్పల్ పారికర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఉత్పల్ కు పనాజీ సీటు కేటాయించలేకపోయామని, ప్రత్యామ్నాయంగా మరో రెండు సీట్లు కేటాయించినట్లు..ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీజేపీ గోవా వ్యవహరాల ఇన్ చార్జ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. అయితే ఉత్పల్ మాత్రం తన తండ్రి పోటీ చేసిన స్థానాన్ని సెంటిమెంట్ గా భావిస్తుండడం వల్ల..అక్కడి నుంచే పోటీకి దిగాలని యోచిస్తున్నారని సమాచారం.

Read More : EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు

బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో ఇతర పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఉత్పల్ ను తమ పార్టీలో ఆహ్వానించారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఉత్పల్ కనుక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే..మద్దతిస్తామని శివసేన ప్రకటించింది. పనాజీ అభ్యర్థిగా ప్రకటించిన అటనాసియో బాబుష్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2008లో పీఎస్ పై జరిగిన దాడిలో నాయకత్వం వహించారని, మైనర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలున్నాయి. 2017 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలుపొందిన ఈయన…2019 జనవరిలో తిరుబాటులో ఆయన..మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి జంప్ అయిపోయారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా కొనసాగిన మనోహర్ పారికర్ గోవా సీఎంగా మూడుసార్లు పని చేశారు. ఈయన 2019లో కన్నుమూశారు. మరి ఉత్పల్ పారికర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు