×
Ad

Goa Fire Accident : గోవాలో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23మంది మృతి.. మృతులంతా వారే..

Goa Fire Accident : గోవాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో

Goa Fire Accident

Goa Fire Accident : గోవాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎసిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో 23మంది మరణించారు.

Also Read : LIC Insurance Plans : LICలో 2 సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు.. కష్ట సమయాల్లో మీకే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా శ్రీరామరక్ష.. ఫుల్ డిటెయిల్స్..!

ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించారు. సిలిండర్ పేలడంతో మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మృతుల్లో 20మంది ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 23మందిలో నలుగురు పర్యటకులుకాగా.. మిగిలిన వారంతా క్లబ్ సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

భారీ అగ్నిప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. గోవా డీజీపీ అలోక్ కుమార్ సహా సీనియర్ పోలీసు అధికారులు, ఉత్తర గోవా జిల్లా నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.


ప్రమాద స్థలిని స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అంతేకాకుండా ఈ క్లబ్ నడిచేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గోవా డీజీపీ మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయని, దీంతో ఎక్కువ మంది సిబ్బంది మరణించారని తెలిపారు.