Jewellery sale on Karva Chauth
Heavy gold sales: ఒక్కరోజే భారీగా బంగారం, వెండి ఆభరణాలు విక్రయాలు జరిగాయి. భారీగా అంటే ఎంతో తెలుసా..? రూ. 3వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఇంత భారీ మొత్తంలో బంగారం, వెండి విక్రయాలు జరిగింది కర్వా చౌత్ వేడుకలో.. దీంతో కర్వా చౌత్ వేడుక అరుదైన రికార్డును నమోదు చేసింది. కోవిడ్ పరిస్థితి కారణంగా వరుసగా రెండేళ్లుగా అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. కొవిడ్ తరువాత దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలు లాభాల్లో అడుగుపెడుతున్నాయి.
కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్), అఖిల భారత జ్యువెల్లర్స్, గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) తెలిపిన వివరాల ప్రకారం.. కర్వాచౌత్ వేడుక సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు సుమారు రూ. 3,000 కోట్ల విలువైనవి విక్రయాలు జరిగినట్లు తెలిపారు. 2021 సంవత్సరంలో సుమారు రూ. 2,200 కోట్ల బంగారం ఆభరణాలు విక్రయాలు జరిగాయి. తాజాగా గత ఏడాదితో పోలిస్తే 36శాతం వృద్ధిని నమోదు చేసుకుందని వారన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
వ్యాపార పరంగా బంగారం, వెండి వ్యాపారులకు అక్టోబర్, నవంబర్ నెలలు చాలా పవిత్రమైన సమయం. కర్వాచౌత్ తర్వాత పుష్య నక్షత్ర, దంతేరాస్, లక్ష్మీ పూజ, దీపావళి, భైయా దూజ్, ఛాత్ పూజ, తులసి వివాహం అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుపుతారుని కెయిట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్, ఏఐజేజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. జన సామాన్యం భారీ మొత్తంలో లైట్ వెయిట్ జ్యువెలరీ కొనుగోలు చేశారని, ఫ్యాషన్ జ్యువెలరీ, ట్రెడిషనల్ జ్యువెలరీ, సిల్వర్ ఆభరణాలు భారీగా స్థాయిలోనే కొన్నారని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.48,000గా ఉంది. అదేవిధంగా వెండి కిలో రూ.59,000గా ఉంది.