Gold Prices : బంగారం ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన ధరలు

దేశంలోని బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగు వారాల

Gold And Silver Prices Continue To Surge : దేశంలోని బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగు వారాల గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో పుత్తడి ధరలు పెరిగాయి. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 0.1% పెరిగి 1,826.40 డాలర్లకు చేరుకుంది. జూన్ 16 తర్వాత ఇదే అత్యధికం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.48,108 నుంచి రూ.48,474 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.335 పెరిగి రూ.44,402 దగ్గర నిలిచింది.

హైదరాబాద్ మార్కెట్ లోనూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 నుంచి రూ.45,150కి చేరుకుంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 నుంచి రూ.49,260కు పెరిగింది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కేజీ వెండి ధర రూ.581 పెరిగి కిలో రూ.69,516కు చేరింది.

కాగా, అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌ట్టినా, దేశీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డం విశేషం. గ‌త మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో పసిడి కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. పెరుగుతున్న ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు