Gold Price: బెంబేలెత్తిస్తున్న బంగారం.. భారత్‌లో రికార్డు స్థాయికి గోల్డ్ ధరలు

బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ ధరలు.. గురువారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల మధ్య బంగారం ధరలు భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Gold Price: బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ ధరలు.. గురువారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల మధ్య బంగారం ధరలు భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Gold

గురువారం ట్రేడింగ్ సెషన్ లో, ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ. 58,826కి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 1.29 శాతం లాభంతో రూ. 58,700 వద్ద ట్రేడవుతోంది.

Gold

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో బంగారం ధరలు పెరుగుదల కారణంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం పెరుగుదలకు రెండు విషయాలను మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్ పరిమితుల సడలింపు తరువాత బంగారంకు డిమాండ్ పెరిగిందని, దీని కారణంగా ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

Gold

మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసే క్రమంలో యూఎస్ ఫెడర్ రిజర్వ్ యూఎస్‌లో వడ్డీ రేట్లను పావుశాతంకు పెంచింది. దీనికారణంగా బంగారం ధరలు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే 2023 సంవత్సరంలో జనవరి నెలలోనే బంగారం ధర రూ. 4వేలు పెరగడం గమనార్హం.

Gold

గురువారం ట్రేడింగ్ ప్రారంభంతో 10 గ్రాముల బంగారం రూ. 58,826 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నంకు రూ. 58,700 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు నెలల్లో భారత్ లో బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. బంగారం ధర 10 గ్రామలకు నాలుగు నెలల్లో రూ. 9వేల మేర పెరగడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నెలలో రూ. 4వేలు పెరిగింది.

Gold Price

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పోటీపడుతున్నాయి. వెండి కిలో 11నెలల గరిష్టం రూ. 71,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలాఉంటే రానున్న రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ. 62వేలకు చేరే అవకాశం ఉన్నట్లు పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు