Gold Sales In High
Gold Rate : దసరా, దీపావళి సమయంలో పరుగులు తీసిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లి ముహుర్తాలు కూడా తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా బంగారం ధరల్లో పెద్ద మార్పులేమీ జరగలేదు. సోమవారం రూ.10 రూపాయలు తగ్గిన ధర.. మంగళవారం స్థిరంగా కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. బంగారం ధర స్థిరంగా ఉండటం శుభపరిణామమే అని చొప్పొచ్చు.
చదవండి : Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,890 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,240 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,280 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,280 గా నమోదైంది.
తమిళనాడులో మాత్రం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,050 గా ఉండగా. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,240 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,740 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,900 వద్ద కొనసాగుతోంది.
చదవండి : Gold Rate : బంగారం ధర పరుగులు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,900 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,740 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,900గా ఉంది.
సాగర తీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,740 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900గా ఉంది.