Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.250తగ్గి 45,900లో చేరింది. ఇక ఇదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.280 పెరిగి 50,070కి చేరింది.

Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Prices Today

Gold Rate :  బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.250తగ్గి 45,900లో చేరింది. ఇక ఇదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.280 పెరిగి 50,070కి చేరింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వరుసగా పెరిగిన ధరలు గురువారం కొద్దిగా ఉపశమనం కలిగించాయి. నవంబర్ నెల గడిచిన 19 రోజుల కాలంలోనే 10 గ్రాముల బంగారంపై రూ.2,000 వరకు పెరిగింది. ఇక ఒకేరోజు రూ. రెండు వందలకు పైగా తగ్గడం శుభవార్తే అని చెప్పొచ్చు.

చదవండి : Gold Price : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉన్న బంగారం ధరలను పరిశీలిస్తే

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది.
చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,250కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,450కు చేరింది.
ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,470కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,470కు చేరింది.
విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది.

చదవండి : Gold Sales : దీపావళికి 50 టన్నుల బంగారం కొన్నారు

వెండి రేటు కూడా బంగారం దారిలో పయనించింది. వెండి ధర మరింత పడిపోయింది. రూ.500 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి Silver ధర రూ.71,000కు తగ్గింది. వెండి కొనాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.