ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఆప్ అధినేత…అమిత్ షాతో తొలిసారిగా భేటీ అయిన సందర్భం ఇది.
అమిత్ షాతో చాలా ఫలప్రదమైన సమావేశం జరిగిందని అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన వివిధ ఇష్యూలపై అమిత్ షాతో చర్చించినట్లు ఆప్ అధినేత తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తామిద్దరం అంగీకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆప్-అమిత్ షా ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచేందుకు అమిత్ షా చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని ఆపలేకపోయారు.
గత ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో ఢిల్లీ ప్రజల మధ్య సీఎంగా మూడోసారి కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రజల ఆశిస్సులతోపాటుగా ప్రధాని మోడీ ఆశిస్సులు కూడా కావాలని కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే. తన ప్రమాణస్వీకారానికి దేశంలోని ఏ ఇతర రాజకీయనాయకుడిని ఆహ్వానించని కేజ్రీవాల్ మోడీని మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వారణాశి పర్యటనలో ఉన్న ప్రధాని కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.
గత కేబినెట్ లో పనిచేసిన ఆరుగురు మంత్రులే మరోసారి కేజ్రీవాల్ తో కలిసి మంత్రులుగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినెట్ లో కొత్తవాళ్లకు చోటు లేదని కేజ్రీవాల్ ప్రకటించేశారు. పాతవారినే మరోసారి మంత్రులుగా కంటిన్యూ చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
#WATCH Delhi Chief Minister Arvind Kejriwal meets Union Home Minister Amit Shah at the latter’s residence. pic.twitter.com/uQigQBTpVm
— ANI (@ANI) February 19, 2020