ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా ఎండీ (వైస్ ప్రెసిడెంట్) రాజన్ ఆనందన్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా ఎండీ (వైస్ ప్రెసిడెంట్) రాజన్ ఆనందన్ గూగుల్ కంపెనీకి వీడ్కోలు పలుకనున్నారు. ఎనిమిదేళ్లుగా గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏసియా ఎండీగా కొనసాగిన ఆయన భారత్ లో కంపెనీ అభివృద్ధికి ఎంతో బాధ్యతాయుతంగా కృషి చేశారు. ఏప్రిల్ నెలాఖరులో ఆనందన్ గూగుల్ ఇండియాకు రిజైన్ చేయనున్నారు.
ప్రస్తుతం గూగుల్ కంట్రీ సేల్స్ డైరెక్టర్ గా ఉన్న వికాస్ అగ్నిహోత్రి ఆనందన్ స్థానంలో గూగుల్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా పగ్గాలు అందుకోనున్నారు. ‘ఎనిమిదేళ్ల పాటు ఇండియా, సౌత్ ఈస్ట్ ఏసియాలో గూగుల్ అభివృద్ధికి రాజన్ ఎనలేని సేవలు అందించడం అభినందనీయం. వ్యాపార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలతో అంతర్జాల పర్యావరణ వ్యవస్థ వృద్ధిచెందడంలో రాజన్ ఎంతో సహకరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం’ అని గూగుల్ ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ స్కాట్ బియోమాంట్ తెలిపారు.
Read Also : హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు ?
మైక్రోసాఫ్ట్ లో రెండేళ్ల పాటు కొనసాగిన రాజన్.. మైక్రోసాఫ్ట్ నుంచి 2011 ఫిబ్రవరిలో గూగుల్ కంపెనీలో జాయిన్ అయ్యారు. డెల్ ఇండియా, మెక్ కిన్సే అండ్ కంపెనీలో కూడా రాజన్ వర్క్ చేశారు. భారత దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను యూజర్లకు టైర్ II, III Towns, నవలేఖ వంటి సర్వీసులను అందించడంలో ఘనత సాధించిన రాజన్ 2018లో IMPACT పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.
ఇండియన్ ఏంజెల్ నెట్ వర్క్ లో సభ్యుడిగా ఉన్న రాజన్.. ప్రొలిఫిక్ ఏంజెల్ ఇన్వెస్టర్ గా కూడా సేవలు అందించారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన వాటిలో వెబ్ ఎంగేజ్, ఇస్టా మోజో, క్యాపిల్లరీ టెక్నాలజీస్, ట్రావెల్ ఖానా, ఈజీగోవ్ ఉన్నాయి. గూగుల్ ఇండియా ఎండీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజన్.. సిక్యూయా క్యాపిటల్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా జాయిన్ కానున్నారు. ఈ మేరకు VC Fund ఒక ప్రకటనలో తెలిపింది.
We’re thrilled to welcome @RajanAnandan to the leadership team @sequoia_India as investment advisor & mentor to the @_surgeahead founders. Rajan’s depth of experience & expertise will be invaluable in this journey!https://t.co/jgxC8uu8HP
— Sequoia_India (@Sequoia_India) April 2, 2019
Read Also : Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్